ఒక్కడి కోసం ఒక్క స్ట్రోక్ లో కొన్ని లక్షల గుండె చప్పుళ్లు: నాగబాబు

  • అదో గొప్ప అనుభూతి
  • మీ ప్రేమాభిమానాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి
  • మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలంటూ నాగబాబు ట్వీట్
నిన్న జనసేన 9వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటంలో నిర్వహించిన సభకు లక్షల మంది అభిమానులు తరలివచ్చారు. సభ సందర్భంగా పార్టీ రాజకీయ ఎజెండాను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సభలో పవన్ సోదరుడు నాగబాబు కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజగా ఆయన సభపై ట్వీట్ కూడా చేశారు. ఒక్కడి కోసం ఒక్క స్ట్రోక్ లో కొన్ని లక్షల గుండెల చప్పుళ్లు వినిపించాయన్నారు. 

‘‘మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలే అవినీతి రహిత పాలన ఏర్పాటులో భాగంగా మెరుగైన, ధైర్యవంతమైన రేపటి సమాజం కోసం మేం ముందుకు నడిచేలా చేస్తున్నాయి. ఒక్కడి కోసం.. ఒక్క జనసేనాని పవన్ కల్యాణ్ కోసం ఒక్క స్ట్రోక్ లోనే కొన్ని లక్షల గుండె చప్పుళ్లు వినిపించడం చూస్తుంటే చాలా గొప్ప అనుభూతినిస్తోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.

Nagababu
Pawan Kalyan
Janasena

More Telugu News